విజయవాడ ప్రభుత్వ అతిథిగృహంలో ఉన్న ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో సిబ్బందితో పాటు కోఆర్డినేటర్ కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌తో పాటు వివిధ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స పొందుతున్నారు 15మంది ఆరోగ్య మిత్రలు.
విషమ పరిస్థితుల్లో ఈ రోజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఒక పర్యవేక్షణ అధికారి. ఆయనకు వెంటిలేటర్ కూడా దొరకని పరిస్థితుల్లో తక్షణం స్పందించి వెంటిలేటర్ ఏర్పాటు చేసిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ యార్లగడ్డ బాలసుబ్రహ్మణ్యం. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు.