Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో వింత పురుగులు... ఒంటిపై వాలితే దురద, దద్దుర్లు

Advertiesment
Strange worms
గుంటూరు జిల్లా రొంపిచర్లలో ప్రజలు వింత పురుగులను చూసి టెన్షన్ పడుతున్నారు. 
రొంపిచర్ల మండలంలో పలు గ్రామాల్లో ఈ పురుగులు సంచరిస్తున్నాయి. ఆ పురుగులు ఒంటిపై వాలినా.. కుట్టినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని వీరవట్నం సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
 
వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పురుగుల దెబ్బకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుబాబుల్ తోటల వల్లే పురుగులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
 
గతంలో ఎప్పుడూ ఇలాంటి వాటిని చూడలేదని రైతులు కూడా చెబుతున్నారు. ఈ పురుగులు ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న ఆ పురుగుల్ని పరిశీలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 నెలలకు సీఆర్టీ టీచర్ల సేవలు, సెలవు కాలంలోనూ అందనున్న వేతనాలు