Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై దాడి... చైనా సాయం కోరిన రష్యా.. ఆర్థిక వ్యవస్థ కుదేలు

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (13:49 IST)
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వచ్చే ఏడాది రష్యా ఆర్థిక వ్యవస్థ ఏడు శాతానికి పడిపోవచ్చునని అంచనా. ఉక్రెయిన్ దాడి రష్యాను దివాలా అంచున వుంచింది. స్టాక్ మార్కెట్ షట్టర్ క్లోజ్ అయ్యింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా సైనిక ఖర్చులు తీవ్రమయ్యాయి. రష్యా పౌరులు ప్రస్తుతం మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్‌లో ఖర్చు చేయలేకపోతున్నారు. 
 
రష్యన్ స్టాక్ మార్కెట్ల ప్రస్తుత పతనం 1998 క్రాష్ కంటే పెద్దది. గత దశాబ్దంలో ఎటువంటి వృద్ధిని చూడని ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్. చమురు, గ్యాస్ ఎగుమతి ఆగిపోవడం ద్వారా వచ్చే ఏడాది రష్యా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే అవకాశం వుంది. ఇంతలో యూరోపియన్ యూనియన్ రష్యాపై తన శక్తి ఆధారపడటాన్ని తీవ్రంగా తగ్గించాలని యోచిస్తోంది. 
 
గత 18 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తోంది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు క్షిపణి దాడులు, బాంబు దాడులతో ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తున్నప్పటికీ.. ఇంకా ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేదు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా చైనా నుండి సైనిక సహాయం కోరింది.
 
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య తర్వాత అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు స్విఫ్ట్ ఆర్థిక వ్యవస్థ నుండి రష్యాను తొలగించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అనేక ప్రధాన రష్యన్ బ్యాంకులు, ఉన్నత స్థాయి రష్యన్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించాయి. 
 
అదే సమయంలో రష్యాకు సహాయం చేయడానికి చైనా సిద్ధంగా ఉంటుందో లేదో తనకు ఇంకా పూర్తిగా తెలియదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు తెలిపారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా చైనా నుండి సైనిక సహాయం కోరింది. రష్యా చైనాను సైనిక సహాయంతో పాటు ఆర్థిక సహాయం కోరినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments