Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్యాకు షాక్: యూట్యూబ్‌, గూగుల్ ప్లే సేవలు బంద్

రష్యాకు షాక్: యూట్యూబ్‌, గూగుల్ ప్లే సేవలు బంద్
, గురువారం, 10 మార్చి 2022 (18:04 IST)
అగ్రరాజ్యం అమెరికా సహా నాటో, ఈయూ దేశాలు సహా పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి యూట్యూబ్‌, గూగుల్ ప్లేలు కూడా చేరిపోయాయి. 
 
ఈ రెండు సంస్థ‌ల‌కు చెందిన అన్నిచెల్లింపుల సేవ‌ల‌ను ర‌ష్యాలో నిలిపివేస్తున్న‌ట్లుగా ఈ సంస్థ‌ల మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గురువారం ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 
 
వాస్త‌వానికి ఇదివ‌ర‌కే యూట్యూబ్‌తో పాటు గూగుల్ కూడా ర‌ష్యా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను త‌మ వేదిక‌పై నిషేధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చెల్లింపుల‌తో కూడిన త‌న సేవ‌ల‌న్నింటినీ కూడా ర‌ష్యాలో నిలిపివేస్తున్న‌ట్లుగా యూట్యూబ్‌, గూగుల్ ప్లే తెలిపాయి. 
 
ఈ నిర్ణ‌యంతో ర‌ష్యాకు చెందిన వినియోగ‌దారుల‌కు యూట్యూబ్ ప్రీమియ‌మ్‌, ఛానెల్ మెంబ‌ర్ షిప్‌, సూప‌ర్ ఛాట్‌, మ‌ర్కెండైజ్ సేవ‌లు అంద‌వు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ పార్టీ హోదాను కోల్పోనున్న కాంగ్రెస్ పార్టీ?