Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూనమ్ కౌర్ ఫోటో పైన అలాంటి టెక్ట్స్ వాడితే ఖబడ్దార్: యూ ట్యూబర్లకు హెచ్చరిక

Advertiesment
Poonam Kaur photo
, బుధవారం, 9 మార్చి 2022 (12:11 IST)
తమ చిత్రం నాతిచరామిలో నటి పూనమ్ కౌర్ ఫోటోను ఉపయోగిస్తూ దానిపై వేస్తున్న థంబ్ లైన్స్ అభ్యంతరకరంగా వున్నాయని చిత్ర బృందం తెలిపింది. వీటిని సత్వరమే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని యూ ట్యూబర్లకు హెచ్చరిక పంపింది. 

 
ఇదిలావుంటే ఈ చిత్రంలో లీడ్ రోల్  పూనమ్ తాజాగా ఓ ప్రెస్‌ మీట్‌లో పూనమ్‌ కౌర్‌ భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేక పోయానని తెలిపింది.

 
తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు పేర్కొంది. 'మాయాజాలం' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన పూనమ్.. తన జీవితాన్ని సినిమానే మార్చేసిందని చెప్పుకొచ్చింది. ఒక దశలో సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలనుకున్నట్లు పూనమ్ చెప్పుకొచ్చింది. 

 
దేశం వదిలి వెళ్లిపోతానని అమ్మతో చెప్పాను. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్‌ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. ప్రతిరోజూ సీత, దుర్గ, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందానని వెల్లడించింది.

 
ఈ క్రమంలోనే ఉమెన్ సెంట్రిక్‌ మూవీ ఒకటి ఉందని నా ఫ్రెండ్ ఫోన్‌ చేసి చెప్పిందని పూనమ్ కౌర్‌ పేర్కొంది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా, భార్య గురించి చెప్పే కథ అని తెలిసాక ఒప్పుకున్నట్లు వెల్లడించింది. 'నాతి చరామిలోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18 ఏళ్ల అమ్మాయిలా ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల మహిళగా ఉన్నాయి.' అని పూనమ్‌ కౌర్‌ వివరించింది.

 
పూనమ్ చాలా గ్యాప్ తర్వాత నాతి చరామిలో నటిస్తోంది. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియో 24 ఫ్రేమ్స్‌ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమెజాన్‌, హంగామా, సోనీ, టాటా స్కై వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైద‌రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రొరి చిత్ర లుక్ ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు మారుతి