సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని తన వ్యాపార సంస్థ వివాదంపై స్పందించారు. గౌడ కులానికి చెందిన కొందరు ఒక సినిమా గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆ కంటెంట్‌ను యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు కోరినట్లు తెలిపారు.
ఆ రోజునే దానిని యూట్యూబ్ నుంచి తొలగించామని సునీత ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆ వీడియో కారణంగా ఎవరి మనోభావాలను అయినా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణ తెలియజేస్తున్నాము అంటూ ఓ ప్రకటనలో రామ్ చెప్పారు.
అయితే సదరు సినిమా ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం లేకపోవడంతో వారు చెప్పిన వెంటనే ఆ సీన్లను డిలీట్ చేశామని రామ్ స్పష్టం చేశారు.
సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీకి అధినేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సదరు సంస్థ తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్ కొని వాటిని యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తూ ఉంటుంది.