Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ పెట్టుకోలేదని ప్రధానికి ఫైన్... ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:21 IST)
thai PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది.
 
మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని వ్యాక్సినేషన్‌కు సంబందించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా మాస్క్ ధరించి ఉండగా ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా మాత్రం మాస్క్ పెట్టుకోలేదు.
 
ఈ ఫోటోలను ప్రధాని వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో విషయం వెలుగుచూసింది. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంతో అతడికి జరిమానా విధించారు అధికారులు. ఉల్లంఘన కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ స్పందించారు. ప్రధానిని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments