Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు ఆస్కార్ అకాడెమీ నివాళులు

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు ఆస్కార్ అకాడెమీ నివాళులు
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (12:11 IST)
బ్రెయిన్ హెమరేజ్ వ్యాధితో మృతిచెందిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు ఆస్కార్ అకాడెమీ ఘన నివాళులు అర్పించింది. సోమవారం 93వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా సాగుతోంది. క‌రోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం రెండు నెలలు ఆలస్యంగా జరిగింది.
 
ఆస్కార్ అవార్డ్ వేడుక‌ను ఈ సారి వ‌ర్చ్యువ‌ల్ విధానంలో జ‌రిపించారు. ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, కోవిడ్ వ‌ల‌న ఈ వేడుక‌ను రెండు ప్ర‌దేశాల‌లో జ‌రిపించారు. డోల్బీ థియేటర్‌లో, మరోవైపు లాస్‌ఏంజెల్స్‌లో ఆస్కార్‌ 2021 అవార్డు విజేతలను ప్రకటించారు. 
 
"నో మ్యాడ్‌ ల్యాండ్‌" సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ చోలే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ వరించింది. ఇక ఉత్తమ నటుడు: ఆంథోని హోప్‌కిన్స్‌ (ద ఫాదర్‌), ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌ (నో మ్యాడ్‌ ల్యాండ్‌) ఆస్కార్ అందుకున్నారు.
 
ఇదిలావుంటే, 93వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైన‌ర్ భాను అత‌య్య‌ల‌కు అకాడ‌మీ నివాళులు అర్పించింది. 53 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో కేన్స‌ర్‌తో మ‌ర‌ణించిన ఇర్ఫాన్ హాలీవుడ్‌లో ది నేమ్‌సేక్, లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాగ్ మిలియనీర్ మరియు జురాసిక్ వరల్డ్, పాన్ సింగ్ తోమర్, మక్బూల్, ది లంచ్ బాక్స్ వంటి చిత్రాల‌లో న‌టించాడు. దీంతో ఆయ‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెల్సిందే. ఆయనకు ఆస్కార్ అకాడెమీ నివాళులు అర్పించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటీనటులకు సిగ్గూఎగ్గూలేదు.. థూ... : నవాజుద్దీన్ మండిపాటు