సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటెయినర్ రవాణా నౌక ఎవర్ గివెన్‌కు ఈజిప్ట్ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది.
గత నెల 23న ఈ నౌక.. కాలువలో ఇరుక్కుపోయి ఆరు రోజుల తర్వాత కదిలిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇతర నౌకలు రెండువైపులా నిలిచిపోయాయి. ఎవర్ గివెన్‌ను కదిలించడానికి భారీగా అయిన ఖర్చు, కాలువలో రాకపోకలు సాగకపోవడం వల్ల నిలిచిపోయిన ఆదాయం వంటివి లెక్కించి జరిమానా విధించారు. ఇది చెల్లించేవరకు ఆ నౌక తమ జలాల నుంచి కదిలేందుకు వీల్లేదని ఈజిప్ట్ తేల్చిచెప్పింది.
ఎవరి గివెన్ షిబ్ కంటెయినర్ అడ్డంగా చిక్కుకుని పోవడం వల్ల ఆ నౌక యజమానులు అష్టకష్టాలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. కాల్వ నుంచి ముందుకు కదిలేందుకు మోక్షం లభించినప్పటికీ ఆ కంటెయినర్‌ను ఈజిప్ట్ సీజ్ చేసింది. వారానికి పైగా సూయజ్‌లోనే ఎవర్ గివెన్ కదలకుండా మొరాయించడంతో ఆ కాల్వ గుండా సరుకు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.