Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ అన్నం మెతుకు.. తొమ్మిది నెలల చిన్నారి ప్రాణం తీసింది..

Advertiesment
ఓ అన్నం మెతుకు.. తొమ్మిది నెలల చిన్నారి ప్రాణం తీసింది..
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:31 IST)
చిన్నారుల పట్ల కాసింతైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాల మీదకు వస్తుందనేందుకు ఈ ఘటనే సాక్ష్యం. గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు సత్య ఉన్నాడు. 
 
ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుండగా... సత్య ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు యత్నించగా...అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు. 
 
వెంటనే గుర్తించిన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. వైద్యం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృతి చెందాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీకా ఉత్సవ్‌: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే 580 మందికి మాత్రమే ఇచ్చారు, టీకాల కొరతకు కారణమేంటి?