Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ నేతలతో చర్చలు రద్దు చేసుకున్న డోనాల్డ్ ట్రంప్

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:11 IST)
తాలిబన్ నేతలతో జరగాల్సిన శాంతి చర్చలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. గురువారం కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబులో 12 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో జరగాల్సిన శాంతి చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌లో గురువారం జరిగిన ఆత్మాహుతి కారుబాంబు దాడిలో అమెరికా సైనికుడు సహా 12 మంది మరణించారు. ఈ పేలుడుకు కారణం తామేనని తాలిబన్లు ప్రకటించారు. మేరీల్యాండ్‌లోని అధ్యక్ష భవనం క్యాంప్‌ డేవిడ్‌లో అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, తాలిబన్‌ సీనియర్‌ నేతలతో ఆదివారం తాను రహస్యంగా సమావేశం కానున్నట్టు శనివారం ట్రంప్ ట్వీట్ చేశారు. 
 
అయితే, గురువారం జరిగిన కారు బాంబు పేలుడు తమపనేనని తాలిబన్ ప్రకటించడంతో ఆ భేటీని, శాంతి చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తాలిబన్లపై విరుచుకుపడ్డారు. తమ పంతం నెగ్గించుకునేందుకు, చర్చల్లో పైచేయి సాధించడం కోసం ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారని, ఎన్ని దశాబ్దాలు పోరాడాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments