Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్నర్ పరువు తీసిన ఐసీసీ... ది ఏజ్డ్ వెల్... మనిషి దృఢంగానేవున్నా...

Advertiesment
వార్నర్ పరువు తీసిన ఐసీసీ... ది ఏజ్డ్ వెల్... మనిషి దృఢంగానేవున్నా...
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (13:08 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరువు తీసింది. ఒక యేడాది నిషేధం తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న వార్నర్.. ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో వార్నర్... ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో వార్నర్ ఆడిన ఇన్నింగ్స్‌లలో 2, 8, 2, 5, 61, 0, 0 చొప్పున పరుగులు చేశాడు. 
 
దీన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. మైదానంలో ప‌దేప‌దే బ్రాడ్ బౌలింగ్‌లో ఇబ్బందిప‌డుతున్న వార్న‌ర్‌ వైఫల్యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఎత్తిచూపింది. ఆ ట్వీట్‌పై త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఐసీసీ ఓ సెటైర్ కామెంట్ చేసింది. వార్న‌ర్ స‌త్తాపై ఐసీసీ డౌట్ వ్య‌క్తం చేసింది. వార్న‌ర్‌కు వ‌య‌సు మ‌ళ్లిన‌ట్లు ఉంద‌న్న పోస్టును పెట్టింది. దానికో లాఫింగ్ ఎమోజీని కూడా జ‌తప‌రిచింది. 
 
"దిస్ ఏజ్డ్ వెల్‌.. మ‌నిషి దృఢంగానే ఉన్నా.. అత‌ని వ‌య‌సు మీరింద‌ని ఉద్దేశం" వ‌చ్చేలా త‌న ట్యాగ్‌లైన్‌తో వార్న‌ర్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఐసీసీ విమ‌ర్శ‌నాత్మ‌క పోస్టు పెట్టింది. టెస్టుల్లో 46.59 యావ‌రేజ్ ఉన్న ప్లేయ‌ర్ ఇలా ఆడ‌టం ఏంద‌న్న సందేహాం కూడా వ్య‌క్తమవుతోంది. 
 
కాగా, గత యేడాది బాల్ ట్యాంపింగ్ కేసులో చిక్కిన వార్న‌ర్ కొన్ని నెల‌ల క్రికెట్ నుంచి నిషేధానికి గుర‌య్యాడు. యాషెస్ సిరీస్‌తో త‌న రెండో ఇన్నింగ్స్‌ను మొద‌లుపెట్టినా.. అదేమీ అత‌నికి పెద్దగా క‌లిసి రావ‌డంలేదు. కానీ మ‌రో ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ మాత్రం త‌న బ్యాటింగ్ నైపుణ్యంతో ఇంగ్లండ్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నాడు. ప్ర‌స్తుతం యాషెస్ సిరీస్ 1-1 తేడాతో స‌మంగా ఉంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తనంత బలవంతుడు లేడన్నట్టుగా ఫీలవుతాడు.. షమీపై భార్య కామెంట్స్