Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలియా భట్ పెళ్లి కూతురాయనే.. ఎరుపు రంగు లెహంగాలో..?

Advertiesment
Alia Bhatt
బాలీవుడ్ అందాల సుందరి అలియా భట్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లికూతురు లుక్‌లో అలియా భట్ ఆ ఫోటోల్లో అదరగొట్టింది. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్ తన నటనతో అదరగొడుతోంది. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ', 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 
 
ఇంకా అలియా భట్ తెలుగు సినిమాలోనూ నటించనుంది. ప్రముఖ దర్శకుడు బాహుబలి మేకర్ రాజమౌళి తెరకెక్కించే ట్రిపుల్ ఆర్‌లోనూ అలియా హీరోయిన్‌గా నటించనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికూతురు లుక్‌లో వున్న ఫోటోలతో అలియా భట్ కనిపించింది. ఎరుపు రంగు లెహంగాలో అదిరిపోయింది. ఆభరణాలు, అతికిపోయిన మేకప్‌తో భలే అనిపింది. 
 
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ''దుల్హాన్ వాలి ఫీలింగ్'' అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లంతా అలియా భట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ''రణ్‌బీర్ కి దుల్హాన్'', ''రణ్‌బీర్ దుల్హాన్ లేజాయేంగే'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
webdunia
 
ఇకపోతే.. అలియా భట్ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో వున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్-అలియా భట్‌లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కూడా బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. బిటౌన్‌లో రణ్‌వీర్-దీపికాలా.. రణ్‌బీర్-అలియా చూడముచ్చటగా దంపతులు కానున్నారని సినీ జనం అనుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం... అజిత్ జోగి కుమారుడు అరెస్టు