Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

Webdunia
శనివారం, 22 మే 2021 (10:03 IST)
చైనాలో భారీ భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. దక్షిణ కింగ్హైలో శనివారం తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. కింగ్హై నగరానికి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. 
 
కింగ్హై కేంద్రంగా తెల్లవారుజామున 2.04 గంటలకు సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని అక్కడి మీడియా చెబుతోంది. జిన్ జింగ్‌పై కూడా భూకంప ప్రభావం ఉందని అమెరికా సిస్మొలాజిస్టులు తెలియజేశారు.
 
శుక్రవారం రాత్రి యున్నాన్‌లో కూడా భూమి కంపించింది. 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఒకరు చనిపోయారని స్థానిక అధికారులు రిపోర్ట్ చేశారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నారని తెలిపారు. 
 
భూ ప్రకంపనాలు రాగానే జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కూలిపోయామని.. మరికొన్ని దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. ఈ ఘటనల గురించి చైనా నుండి సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

తర్వాతి కథనం
Show comments