Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ మూన్‌లా స్ట్రాబెర్రీ మూన్.. అంటే ఏమిటి?

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (15:47 IST)
straberry moon
ఏరువాక పౌర్ణమి రోజున మరో విశేషం చోటుచేసుకోనుంది. ఆకాశంలో చంద్రుడు సూపర్‌మూన్‌లా కనిపించనున్నాడు. సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా ఇవాళ కనిపించే చంద్రుడు 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
 
అలాగే, సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కన్నా పెద్దదిగా కనిపిస్తాడు. దీన్నే 'స్ట్రాబెర్రీ మూన్' అని కూడా పిలుస్తారు. చంద్రుడు భూమికి మరింత దగ్గరగా రావడం వల్లే ఇలా జరుగుతుంది. సాధారణ రోజుల్లో కన్నా ఈరోజు చంద్రుడు మరో 16 వేల మైళ్ల మేర భూమికి దగ్గరగా వస్తాడు.దీన్నే 'పెరిజీ' అని పిలుస్తారు.
 
స్ట్రాబెర్రీ మూన్ అంటే చంద్రుడు స్ట్రాబెర్రీలా కనిపిస్తాడనో లేక ఆ రంగులో కనిపిస్తాడనో కాదు. ఇది అమెరికన్ మూలవాసులైన అక్కడి గిరిజన తెగల వారు పెట్టిన పేరు.
 
సాధారణంగా జూన్ నెలలో స్ట్రాబెర్రీలు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఈ సమయంలో ఏర్పడే పౌర్ణమి కావడంతో అక్కడి ప్రజలు దీనికి స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు.
 
భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 5.22 గం. సమయంలో ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుంది. సాధారణంగా సూపర్‌మూన్స్ ఏడాదిలో మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే కనిపిస్తాయి. 

సంబంధిత వార్తలు

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments