Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువచేసే మరకత పంచముఖ విగ్రహం లభ్యం

Advertiesment
panchamukha
, సోమవారం, 13 జూన్ 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు బరితెగించిపోతున్నారు. అన్ని విధాలుగా ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్న వైకాపా పాలకులు ఇపుడు సరికొత్త అవతారాలు ఎత్తుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంకు చెందిన ఓ వైకాపా నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువ చేసే మరకత పంచముఖ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  
 
ఈ వ్యవహారంలో వైకాపా నేత వై.వెంకటేశ్వర రావుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న గోళ్ళవిడిపికి చెందిన గ్రామస్థాయి నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయని వెంకటేశ్వర రావు చెప్పడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను తీసుకురావాలని చెబుతూ వారిని విడిచిపెట్టారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పైపైకి...