శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న లంక దేశం ఇపుడు రావణకాష్టంలా రగులుతోంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. దీంతో ఆందోళనకారులు దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్సే దేశం విడిచి పారిపోయాడు.
మరోవైపు, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇదే డిమాండ్‌తో శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు.
ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారిపోవడంతో శ్రీలంక ప్రభుత్వం ఎమెర్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువరించింది.