భారతీయ టెలిస్కోప్ అంతరిక్షంలో ఇంతకుముందు ఎప్పుడూ కనుగొనని చాలా దూరంలో ఉండే రేడియో గేలాక్సీని గుర్తించింది. విశ్వం ప్రస్తుత వయస్సులో కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నప్పుడు ఈ గేలాక్సీ పుట్టింది. దీనిని పూణేలో జెయింట్ మీటర్-వేవ్ రేడియో టెలిస్కోప్ (జిఎమ్ఆర్‌ట
భారతీయ టెలిస్కోప్ అంతరిక్షంలో ఇంతకుముందు ఎప్పుడూ కనుగొనని చాలా దూరంలో ఉండే రేడియో గేలాక్సీని గుర్తించింది. విశ్వం ప్రస్తుత వయస్సులో కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నప్పుడు ఈ గేలాక్సీ పుట్టింది. దీనిని పూణేలో జెయింట్ మీటర్-వేవ్ రేడియో టెలిస్కోప్ (జిఎమ్ఆర్‌టి) సహాయంతో గుర్తించారు. ఈ టెలిస్కోప్‌ని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ నిర్వహిస్తోంది.
ఈ గేలాక్సీ దూరాన్ని హవాయిలోని జెమినీ నార్త్ టెలిస్కోప్ మరియు అరిజోనాలోని పెద్ద బైనాకులర్ టెలిస్కోప్ సహాయంతో కనుగొన్నారు. మన విశ్వానికి ఒక బిలియన్ సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ గేలాక్సీ ఎలా ఉండేదో అలా గ్రహించబడిందని రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ వెల్లడించింది. దీనర్థం గేలాక్సీ నుండి వచ్చిన కాంతి సుమారు 12 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఇంత తక్కువ సమయంలో ఈ గేలాక్సీలు వాటి ద్రవ్యరాశులను ఎలా రూపొందించాయో ఆశ్చర్యం కలుగుతోందని నెథర్‌లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన ఆయుష్ సక్సేనా చెప్పారు.
విశ్వం యొక్క చరిత్రలో ఇటువంటి వస్తువులను కనుగొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఈ సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్‌లు అతి తక్కువ సమయంలో ఏర్పడ్డాయని కూడా చెప్పారు. రేడియో గేలాక్సీలు విశ్వంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి చాలా పెద్దవిగా ఉండి పరిసరాల నుండి వాయువులు మరియు ధూళిని చురుకుగా ఆకర్షించే సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్‌ని కలిగి ఉంటాయి. ఈ చర్య అతిశక్తివంతమైన జెట్ ప్రవాహాలను సృష్టిస్తుంది. దాని వలన బ్లాక్‌హోల్ చుట్టూ కాంతివేగంతో సమానంగా ఛార్జ్డ్ కణాలకు త్వరణం కలుగుతుంది. ఈ ప్రవాహాలను రేడియో తరంగ దైర్ఘ్యంతో చూడవచ్చు.