Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500 జీతం నుంచి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ స్థాయికి...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (17:11 IST)
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఆయన బయోగ్రఫీని పరిశీలిస్తే...
 
హరివంశ్ నారాయణ్ సింగ్ ఓ సాధారణ పాత్రికేయుడు. అలా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన.... 40 యేళ్లపాటు ఎన్నో పత్రికలకు తన సేవలు అందించారు. చాలా ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలోనే ఉన్న ఆయన రాజకీయ రంగం వైపు అడుగు పెట్టి జేడీయూ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. జేడీయూ నుంచి వచ్చి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా ప్రాంతంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1956, జూన్‌ 30న హరివంశ్‌ జన్మించిన ఆయన బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లో ఆర్థికశాస్త్రం‌లో పీజీ చేశారు. అదే యూనివర్సిటీలో జర్నలిజంలో పీడీ డిప్లొమా చేశారు. 
 
ఆయన కాలేజీ రోజుల్లోనే ప్రముఖ సామాజిక వేత్త జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 1974లో జరిగిన జేపీ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొనడమే కాకుండా క్రియాశీలకంగా వ్యవహరించారు. 
 
ఆ తర్వాత 1977లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరారు. పిమ్మట 1981లో ముంబైకి చెందిన ధర్మయుగ్‌ మ్యాగజైన్‌లో పని చేశారు. 1981 నుంచి 84 వరకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేశారు. అక్కడ నుంచి అమృత బజార్‌ పత్రిక మ్యాగజైన్‌ రవివార్‌కు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా 1989 వరకు అక్కడే పని చేశారు. 
 
ఆ తర్వాత హరివంశ్‌ రాంచీకి చెందిన ఉషా మార్టిన్‌ గ్రూప్‌ పత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో పని చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఎడిటర్‌గా ఆ పత్రికకు సేవలు అందించారు. పాత్రికేయ రంగంలో ఆయన అందిస్తున్న విశేషమైన సేవలను గుర్తించిన జేడీయూ ఆయనకు 2014లో టికెట్‌ ఇచ్చింది. 
 
2014లో ఆయన జేడీయూ తరపున పోటీ చేసి విజయం సాధించి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని పి.చంద్రశేఖర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు పైగా, అడిషనల్‌ మీడియా అడ్వైజర్‌గా కూడా పని చేశారు. నెలకు రూ.500 వేతనంతో తన తొలి ఉద్యోగాన్ని ప్రారంభించిన హరివంశ్ ఇపుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments