Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లడీ కిడ్... ఏడుపు ఆపకపోతే విమానం కిటికీలో నుంచి తోసేస్తా... ఇండియన్ కుటుంబానికి అవమానం...

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో ప్రయాణించే ఇండియన్ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది. మూడేళ్ల పసి బాలుడు ఏడుస్తూ వున్న సమయంలో క్రూ సిబ్బంది అక్కడికి వచ్చి.... బ్లడీ కిడ్.. ఏంటా ఏడుపు, ఆపకపోతే వాడిని కిటీలో నుంచి కిందికి తోసేస్తా అంటూ గావు కేకల

బ్లడీ కిడ్... ఏడుపు ఆపకపోతే విమానం కిటికీలో నుంచి తోసేస్తా... ఇండియన్ కుటుంబానికి అవమానం...
, గురువారం, 9 ఆగస్టు 2018 (15:23 IST)
బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో ప్రయాణించే ఇండియన్ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది. మూడేళ్ల పసి బాలుడు ఏడుస్తూ వున్న సమయంలో క్రూ సిబ్బంది అక్కడికి వచ్చి.... బ్లడీ కిడ్.. ఏంటా ఏడుపు, ఆపకపోతే వాడిని కిటీలో నుంచి కిందికి తోసేస్తా అంటూ గావు కేకలు వేశారు. దీనితో భయపడిపోయిన చిన్నారి మరింత బిగ్గరగా ఏడ్చేశాడు. 
 
మరిన్ని వివరాల్లోకి వెళితే... గత నెల జూలై 23న లండన్ నుంచి బెర్లిన్ వెళ్లే విమానంలో భారతీయ సంతతికి చెందిన జంట తమ మూడేళ్ల కుమారుడితో విమానం ఎక్కింది. ఐతే పిల్లవాడు ఎందుకో ఏడవడం మొదలుపెట్టాడు. అతడిని సముదాయించేందుకు పిల్లవాడి తల్లి ప్రయత్నించింది. సీటు వెనకాల వున్న మరికొంతమంది ఇండియన్ ప్రయాణికులు బిస్కెట్లు ఇచ్చి బాలుడి ఏడుపు మాన్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో విమానం క్రూ సిబ్బంది క్రూరంగా ప్రవర్తించింది. 
 
పిల్లవాడి దగ్గరకి వచ్చి గావు కేకలు వేసారు. అతడు ఏడుపు ఆపకపోతే విమానం కిటికీ నుంచి కిందికి తోసేస్తామని అరిచారు. అంతేకాదు... టేకాఫ్ చేయాల్సిన విమానాన్ని తిన్నగా వెనక్కి తీసుకొచ్చి పిల్లవాడు, అతడి తల్లిదండ్రులతో పాటు పిల్లవాడికి బిస్కెట్లు ఇచ్చినవారిని కూడా కిందికి దించేశారు. దీనిపై బాలుడి తండ్రి భారత విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఆవేదనతో లేఖ రాశారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ తమను తీవ్రంగా అవమానించడమే కాకుండా జాతి వివక్షకు పాల్పడిందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో జయ, కరుణ.. ఇద్దరూ కలిసిపోయారు..