Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో నరకం అనుభవించా.. 14 సంవత్సరాల తర్వాత విముక్తి..

సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఓ బాధిత మహిళ మీడియాకు చెప్పింది. తనను జంతువులా హింసించారని.. సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరిన బ

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:43 IST)
సౌదీ అరేబియాలో తాను భయంకరమైన నరకాన్ని అనుభవించానని.. 14 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని ఓ బాధిత మహిళ మీడియాకు చెప్పింది. తనను జంతువులా హింసించారని.. సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరిన బాధితురాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఉడిపి ప్రాంతానికి చెందిన 42 ఏల్ల జసింత మెండోనికాను ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికింది. 
 
కానీ సౌదీ అరేబియాలో యంబు ప్రాంతంలోని ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. మెండోనికా పనిచేసే ఇంటి యజమానులు ఆమెను తీవ్రంగా హింసించింది. వాటిని తాళలేక మెండోనికా గత ఏడాది నవంబరులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ అధికారులు ఆమెను పట్టుకుని మళ్లీ యజమాని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత మెండోనికా పరిస్థితి మరీ అధ్వానంగా మారిపోయింది. 
 
ఎంత బతిమలాడుకున్నా కానీ ఆమెకు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారు. ఎట్టకేలకు మెండోనికాను 14 నెలల తర్వాత మానవహక్కుల పరిరక్షణ సంస్థ సిబ్బంది కాపాడింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments