Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే దశ తిరిగినట్లే..

మన భారతదేశంలో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. అమ్మాయి కట్టు, బొట్టు, తీరూ, తెన్నూ, అమ్మాయి నుదుటి నుంచి కాలి పాదాల వరకు అన్నీ గమనించాకే పెళ్ళి చేసుకుంటారు. కాళ్ళను చూసి వారు సున్నితంగా ఉంటారా.. సహనవంతులా.. రిస్క్ చేసే తత్వం

ఇలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే దశ తిరిగినట్లే..
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (16:28 IST)
మన భారతదేశంలో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. అమ్మాయి కట్టు, బొట్టు, తీరూ, తెన్నూ, అమ్మాయి నుదుటి నుంచి కాలి పాదాల వరకు అన్నీ గమనించాకే పెళ్ళి చేసుకుంటారు. కాళ్ళను చూసి వారు సున్నితంగా ఉంటారా.. సహనవంతులా.. రిస్క్ చేసే తత్వం కలవారా, స్థిరంగా ఉండేవారా అన్న విషయాన్ని గతంలో పెద్దలు చెప్పేవారు. అమ్మాయికి కాలి బొటన వేలికంటే పక్కనే ఉండే రెండవవేలు పొడవుగా ఉండే అలాంటి అమ్మాయిని గడుసుది అని అంటారు.
 
కాలివ్రేళ్ళు అన్నింటిలోకెల్లా బొటనవేలు పొడవుగా ఉంటే చాలా తెలివి కలిగి ఉంటారట. అలాగే వీరికి సృజనాత్మకత కూడా ఎక్కువే. బొటనవేలు అన్నింటి కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు ఏ పని అయినా ఎన్ని పనులు అయినా చాలా తేలిగ్గా చేసేస్తారట. కాలి రెండవ వేలు అన్ని వేళ్ళ కంటే పొడవుగా ఉంటే అమ్మాయిల్లో లీడర్‌షిప్ క్వాలిటీలు ఉంటాయి. అంతేకాదు డైనమిక్‌గా కూడా ఉంటారు. ఇతరుల మీద ఆధిపత్యం ప్రదర్శించే తత్వం కలిగి ఉంటారు. కాలి రెండవ వేలు అన్నింటి కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు అందరితో కలివిడిగా తొందరగా కలిసిపోతారు.
 
అంతేకాకుండా కాలి మొదటి మూడువేళ్ళు సమానంగా ఉండి చివరి రెండు వ్రేళ్ళు చిన్నగా ఉండే అమ్మాయిలు శక్తివంతంగా, దృఢంగా ఉంటారు. అలాంటి అమ్మాయిల్లో ఊహించని శక్తి దాగి ఉంటుంది. మొదటి నాలుగువ్రేళ్ళు సమానంగా ఉండి చిటికెన వేళ్ళు చిన్నగా ఉండే అమ్మాయిలు కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తారు. ఎదుటివారు చెప్పే మాటలు చాలా శ్రద్థగా వింటారు. కాలివ్రేళ్ళలో నాలుగో వ్రేలు పొట్టిగా ఉండే అమ్మాయిల పట్ల ఫ్యామిలీ పట్ల, రిలేషన్‌షిప్‌ల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదనే చెప్తారు. వీళ్ళు బంధాలకు అస్సలు విలువనివ్వరట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగే.. వటే...' (Bathukamma Video Song)