Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

''సాహో''లో రాయలసీమ అమ్మాయిగా శ్రద్ధా కపూర్.. ఫిదాకు పోటీగా సీమ యాసలో?

బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రద

Advertiesment
Shraddha kapoor
, మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (11:32 IST)
బాహుబలి సినిమాకు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఒక రోల్‌లో రాయలసీమ అమ్మాయిగా సంప్రదాయబద్ధంగా.. విలేజ్ అమ్మాయిగా కనిపిస్తే.. మరో షేడ్‌లో మోడ్రన్ అమ్మాయిగా కనిపించనుందట.
 
ఈ కారణంగానే ప్రభాస్‌కి శిక్షణ ఇస్తోన్న హాలీవుడ్ స్టంట్ మాస్టర్, శ్రద్ధా కపూర్‌కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడట. ఈ పాత్రలో శ్రద్ధా కపూర్ చాలా కొత్తగా కనిపిస్తుందని టాక్ వస్తోంది. ఈ చిత్రంతో శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాతో తెలుగులో శ్రద్ధా కపూర్‌కి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఫిదాలో తెలంగాణ యాసను హీరోయిన్‌చేత పలికించిన మేకర్స్... ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‌ద్వారా రాయలసీమ యాసను పలికించేందుకు సిద్ధమవుతున్నారట. ఇక బాలీవుడ్ నటీనటులు ఎక్కువగా కనిపించే ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల కానుంది.
 
ఇకపోతే.. ప్రభాస్‌ హీరోగా నటించే సాహో సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటికొస్తోంది. తాజాగా అన్నవరం, ఖతర్నాక్‌ సినిమాల్లో నటించి, ఇటీవలే ‘మన్యం పులి’లో మోహన్‌లాల్‌ మామగా ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు లాల్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో వేసిన ఓ సెట్‌లో సాహో షూటింగ్‌ జరుగుతోంది. ప్రభాస్‌తోపాటు, లాల్‌ కూడా తాజా షెడ్యూల్‌లో పాలుపంచుకుంటారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధరమ్ తేజ్- నిహారికకు పెళ్లా? ఏ దరిద్రుడో క్రియేట్ చేసి వుంటాడు: నాగబాబు