Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాహోలో శ్రద్ధా కపూర్ డుయల్ రోల్..? నిజమేనా?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా దక్షిణాది, ఉత్తరాదిలో హాట్ టాపిక్ అయ్యింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ

Advertiesment
సాహోలో శ్రద్ధా కపూర్ డుయల్ రోల్..? నిజమేనా?
, శనివారం, 9 సెప్టెంబరు 2017 (17:54 IST)
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా దక్షిణాది, ఉత్తరాదిలో హాట్ టాపిక్ అయ్యింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. బాహుబలి అనుష్క శెట్టిని ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటింపజేయాలనుకున్నా.. బరువు విషయంలో దేవసేనకు ఆ ఛాన్స్ మిస్సైంది.
 
ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ ఇందులో ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం. ఒక పాత్రలో అమాయకురాలిగా ప్రభాస్‌కు జోడీగా నటించే శ్రద్ధా కపూర్.. మరో పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో కనిపిస్తుందని టాక్. ఇప్పటికే హిందీ, తెలుగు భాషలను ఒకరు మార్చి ఒకరు చెప్పించుకుని నేర్చుకుంటున్న ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండిస్తారని టాక్ వస్తోంది.
 
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సాహో కోసం శ్రద్ధా కపూర్ స్టంట్స్ నేర్చుకుంటుందని బిటౌన్‌లో టాక్. నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, జాకీ ష్రోఫ్, మహేష్ మంజ్రేకర్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తున్న ఈ చిత్రం రూ. 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. 2018లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ రొమానియా, అబుదాబి, హైదరాబాద్, ముంబైలలో జరుగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీముఖి, అనసూయల లేటెస్ట్ ఫోటోలు మీరూ చూడండి..