Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా మేజర్ జనరల్‌ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ బలగాలు

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (12:40 IST)
ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్ర సాగిస్తున్న రష్యాకు యుద్ధభూమిలో గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. గత 13 రోజులుగా ఈ యుద్ధం సాగుతున్నప్పటికీ రష్యా సేనలను ఉక్రెయిన్ సేనలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. అదేసమయంలో రష్యా సైనికులను భారీ సంఖ్యలో మట్టుబెడుతున్నాయి. 
 
తాజాగా రష్యా మేజర్ జనరల్‍ను ఉక్రెయిన్ సేనలు హతమార్చాయి. ఆయన పేరు విటాలీ గెరసిమోవ్‌ తమ బలగాల దాడిలో హతమైనట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. మేజర్ జనరల్ విటాలీ రష్యాలోని మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్ కావడం గమనార్హం. 
 
రెండో చెచెన్ యుద్ధం సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాలలో విటాలీ కీలక పాత్ర పోషించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, 2014లో క్రిమియాను తిరిగి సొంతం చేసుకున్నందుకు ఆయన మెడల్ కూడా లభించిందని తెలిపింది. కాగా, ఈ యుద్ధంలో రష్యాకు చెందిన సైనికులు, సైనికాధికారులు ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments