Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పేస్‌లో ఫస్ట్ టైమ్ మూవీ షూట్ .. అంతరిక్షంలోకెళ్లిన రష్యా నటి - డైరెక్టర్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (22:37 IST)
అత్యాధునిక టెక్నాలజీ ఎక్కడికో వెళ్లిపోతోంది. ప్ర‌పంచంలోనే తొలిసారి అంతరిక్షంలో ఓ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం ఓ ర‌ష్యా నటి, దర్శకుడు స్పేస్‌లోకి వెళ్లారు. వీళ్లిద్దరూ మంగళవారం నింగిలోకి దూసుకెళ్లారు. 
 
ర‌ష్యాకు చెందిన న‌టి యూలియా పెరెసిల్డ్‌, డైరెక్ట‌ర్ క్లిమ్ షిపెంకోల‌ను కాస్మోనాట్ ఆంటోన్ ష్కాప్లెరోవ్ ర‌ష్య‌న్ సోయెజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంత‌రిక్షంలోకి తీసుకెళ్లారు. స్థానిక కాల‌మానం ప్రకారం మ‌ధ్యాహ్నం 1.55 గంట‌ల స‌మ‌యంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి ఎగిరింది. క‌జ‌క్‌స్థాన్‌లోని బైక‌నూర్‌లో ఉన్న ర‌ష్యన్ స్పేస్ సెంట‌ర్ నుంచి ఈ సోయెస్ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేశారు. వీళ్లు ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌కు వెళ్ల‌నున్నారు.
 
చాలెంజ్ అనే కొత్త మూవీ కోసం పెరిసిల్డ్‌, క్లిమెంకోలు స్పేస్ స్టేష‌న్‌కు వెళ్లారు. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేష‌న్‌లోనే ఉండ‌నున్నారు. ఆ త‌ర్వాత వీళ్ల‌ను మ‌రో ర‌ష్య‌న్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకువ‌స్తారు. అంత‌రిక్షంలోకి వెళ్లే ముందు పొందిన శిక్ష‌ణ త‌న‌కో స‌వాల‌ని స్పేస్‌క్రాఫ్ట్ ఎక్కే ముందు న‌టి పెరెసిల్డ్ చెప్పుకొచ్చింది. 
 
దర్శకుడు షిపెంకోతో క‌లిసి ఆమె నాలుగు నెల‌ల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంది. స్పేస్‌లో మూవీ షూటింగ్‌ను ర‌ష్య‌న్ మీడియాలో కొంద‌రు తీవ్రంగా విమ‌ర్శించినా లెక్క చేయ‌కుండా ర‌ష్య‌న్ స్పేస్ కార్పొరేష‌న్ రాస్‌కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిష‌న్‌లో కీల‌క పాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments