Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేబుల్ మీద రూ. 70 కోట్లు, పావుగంటలో ఎంత లెక్కిస్తే అంత మీదే: ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (14:14 IST)
చైనా కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనీస్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్‌లలో దాదాపు రూ.70 కోట్లు ఆఫర్ చేసింది. ఐతే ఈ బోనస్ తీసుకుని వెళ్లేందుకు ఒకే ఒక షరతు పెట్టింది. టేబుల్ పైన 70 కోట్ల డబ్బు పెడతామనీ, అందులో మీరు కేవలం పావుగంటలో ఎంత డబ్బు లెక్కించగలుగుతారో అంతా తీసుకుని ఇంటికి వెళ్లవచ్చు అని చెప్పింది.
 
ఇంకేముంది... ఉద్యోగులందరూ వీలైనంత ఎక్కువ డబ్బును లెక్కించేందుకు ఎగబడ్డారు. ఒక ఉద్యోగి అందరికంటే ఎక్కువగా పావుగంటలో దాదాపు రూ.12.07 లక్షలు లెక్కించి పట్టుకెళ్లాడు. దీనిని సోషల్ మీడియాలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు కంపెనీ దాతృత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు ఈ విధానాన్ని ప్రశ్నించారు. దీనిపై ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... ఈ సర్కస్ ఫీటుకి బదులుగా మీరు కార్మికుడి ఖాతాల్లోకి జమ చేయవచ్చు. ఉద్యోగుల విషయంలో ఇది ఒక రకమైన అవమానకరమైనది అంటూ పేర్కొన్నాడు.
 
హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ తమ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తమ ఉద్యోగులకు అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఆశ్చర్యచకితుల్ని చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మార్పు రావాలి : కౌశిక్, విజయ్ రెడ్డి పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments