వినియోగదారులకు షాకిచ్చిన రిలయన్స్ జియో

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (14:13 IST)
రిలయన్స్ జియో మరోమారు వినియోగదారులకు తేరుకోలేని షాకిచ్చింది. తాజాగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొత్త ప్లాన్లను పరిచయం చేసిన జియో.. అదేసమయంలో పాత ప్లాన్లను తీసేసింది. ఇప్పటివరకు అందిస్తున్న రూ.189, రూ.479 రీఛార్జి ప్లాన్లను తన వెబ్‌సైట్‌ నుంచి పూర్తిగా తొలగించింది.
 
తక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జి ప్లాన్లు కావాలనుకొనే యూజర్ల కోసం జియో గతంలో రూ.189 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందించేది. 2జీబీ డేటా కూడా లభించేది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. దీంతో పాటు 84 రోజుల వ్యాలిడిటీతో రూ.479 ప్లాన్‌ అందుబాటులో ఉండేది. అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌, 1000 ఎస్సెమ్మెస్‌లు, 6జీబీ డేటా వంటి ప్రయోజనాలు లభించేవి. వాల్యూ ప్లాన్స్‌గా వీటిని వ్యవహరించేవారు.
 
ట్రాయ్‌ ఆదేశాలకు అనుగుణంగా రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.458 ప్లాన్‌, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1958 ప్లాన్‌ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లపై జియో టీవీ, సినిమా(నాన్‌- ప్రీమియం), క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాలు జోడించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ట్రాయ్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలు అలాగే ఉంచుతూ ప్లాన్ల ధరల్ని తగ్గించింది. రూ.458 ప్లాన్‌ను రూ.448కు, రూ.1958 ప్లాన్‌ను రూ.1748కు తగ్గించింది. వాల్యూ ప్లాన్లను తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments