Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫస్టియర్ విద్యార్థిని పెళ్లాడిన సీనియర్ మహిళా ప్రొఫెసర్.. వీడియో వైరల్

Advertiesment
student marriage

ఠాగూర్

, గురువారం, 30 జనవరి 2025 (08:23 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నాదియా జిల్లాలో గల మౌలానా అబ్దుల్ కలాం అజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో ఓ విచిత్ర చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహించే ఓ సీనియర్ మహిళా ప్రొఫెసర్ తన వద్ద చదువుకునే విద్యార్థిని వివాహమాడారు. వీరిద్దరి పెళ్లి కూడా తరగతి గదిలోనే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది సంచలనంగా మారింది. ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి పోవడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 
 
అయితే, మహిళా ప్రొఫెసర్ మాత్రం.. తన క్లాసులో భాగమైన సైకో డ్రామా ప్రదర్శనగా పేర్కొన్నారు. అదేసమయంలో ఈ విచారణ ముగిసేంత వరకు సెలవుపై వెళ్లాలని యూనవర్శిటీ వైస్ చాన్సెలర్ ఆదేశించారు. అలాగే, సంబంధిత విద్యార్థికి కూడా ఇదే తరహా సూచన చేశారు. 
 
వైరల్ అవుతున్న ఫోటోల్లో మహిళా ప్రొఫెసర్ నవ వధువు అలంకరణలో కనిపిస్తుంది. అలాగే, వరుడుగా ఫస్టియర్ విద్యార్థి. వీరిద్దరి మధ్య ఈ పెళ్లి తంతు కూడా హిందూ, బెంగాలీ వివాహ సంప్రదాయం ప్రకారం జరగ్గా, వారిద్దరూ పూలమాలలు కూడా మార్చుకుని, నిజమైన పెళ్లి తరహాలోనే అన్ని రకాల క్రతువులన్నీ పూర్తి చేయడం గమనార్హం. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైవర్స్ డే సందర్భంగా డ్రైవర్లను గౌరవించడానికి దేశవ్యాప్త కార్యక్రమం ప్రారంభించిన ASRTU