Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాల్ పరిచయం.. ఇద్దరిదీ ఒకే సమస్య.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. (Video)

Advertiesment
marriage

ఠాగూర్

, సోమవారం, 27 జనవరి 2025 (09:20 IST)
తమ భర్తలు నిత్యం మద్యం సేవించి వచ్చి వేధించేవారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు అనునిత్యం నరకం అనుభవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకున్నారు. పైగా, ఇద్దరిదీ ఒకే సమస్య కావడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. సమాజంతో పనిలేకుండా ఆ ఇద్దరు మహిళలు లేచిపోయి వివాహం చేసుకున్నారు. ఈ వింత పెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వింత పెళ్లి వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో బాధపడుతున్నారు. వారి వారి భర్తలకు మద్యపానం అలవాటు, తాగి వచ్చి రోజూ ఇంట్లో చేసే రచ్చ చెప్పుకుంటూ బాధపడుతుండేవారు. మద్యం మత్తులో తమ భర్తలు తిట్టే తిట్లను, పెట్టే హింసను ఇక భరించలేమని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
భర్తలతో సంబంధం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకుని వేరే ఊరిలో కలిసి ఉండాలని కవిత, బబ్లూలు ఓ బలమైన నిర్ణయానికి వచ్చారు. ఆపై ఇద్దరూ ఇల్లు వదిలి గోరఖ్‌పూర్ చేరుకున్నారు. మహిళలు ఇద్దరూ శివాలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇందులో బబ్లూ పెళ్లికొడుకులా కవిత నుదుట తిలకం దిద్దింది. ఆపై ఇద్దరూ దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. దంపతులుగా మారిన కవిత, బబ్లూ ఇకపై గోరఖ్‌పూర్‌లోనే ఉంటామని, ఏదైనా పనిచేసుకుంటూ జీవిస్తామని చెప్పారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమిపై ఇంకా నూకలు మిగిలివున్నాయంటే.. ఇదేరా (Video)