Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ద్రాక్ష కిలో రూ.7.5 లక్షలు..!

Webdunia
శనివారం, 10 జులై 2021 (07:06 IST)
మామూలుగానే ద్రాక్ష రుచిగా ఉంటుంది. తగిన ధరలో కొంటూ ఆ రుచిని ఆస్వాదిస్తాం.. ఓ చోట ద్రాక్ష ప్రత్యేకతే వేరు. ఆ ద్రాక్ష పేరు రూబీ రోమన్‌. ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. ఇది నిజమండీ... అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతి దక్కించుకుంది.

జపాన్‌లో 2019లో ఈ ద్రాక్ష రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇంతకీ ఏంటబ్బా అంత ప్రత్యేకత ఆ ద్రాక్షలో అనుకుంటున్నారా.. అవునండీ.. ఆ ద్రాక్ష ప్రత్యేకతే వేరు.. ఇంత రేటు పలుకుతున్నా ఆ ద్రాక్షను కొనడానికి జనం క్యూ కడుతున్నారండోయ్..
 
పాపులర్‌ టేస్ట్‌..
రూబీ రోమన్‌ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్‌. చక్కటి రంగు, రుచితో పింగ్‌పాంగ్‌ బంతి సైజులో ఉంటుంది ఈ 'రూబీ రోమన్‌ ద్రాక్ష'. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా రాయల్‌గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు. ఐఫోన్‌, తులం బంగారం కంటే ఎక్కువ పెట్టాల్సిందే మరి.
 
ఎక్కడ పండిస్తారంటే..
జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్‌ ద్రాక్ష పండ్లను పండిస్తారు. 2008 నుంచి ఈ ద్రాక్షలను పండించడం ప్రారంభించారు. జపనీస్‌ లగ్జరీ ఫ్రూట్‌ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్‌. ఈ ద్రాక్షను మొదట మార్కెట్లో విక్రయించారు. వేలంలో అధిక ధర చెల్లించినవారికి మాత్రమే ఇది సొంతం. అందుకే దీన్ని కొనడానికి ఔత్సాహికులు క్యూ కడతారు. అంత డిమాండ్‌ ఉంది ఈ ద్రాక్షకు.
 
విఐపి లకు గిఫ్ట్‌లుగా..
సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ, విఐపి గెస్టులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హౌటల్స్‌ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు.
 
ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలు పలికింది..
2019లో ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని 12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments