అగ్రరాజ్య అధినేత జో బైడెన్.. డ్రాగన్ దేశానికి మరోసారి షాక్ ఇవ్వబోతున్నారా? అనే ప్రశ్నకు ఆ దేశ మీడియా అవుననే అంటోంది. గత నెలలో 20కిపైగా చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చిన బైడెన్.. తాజాగా మరికొన్ని కంపెనీలపై నిషేధం విధించేందుకు సిద్ధం అయినట్టు అమెరికా మీడియా కోడైకూస్తోంది.
చైనాకు సంబంధించిన సుమారు 10 కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధిస్తూ బైడెన్ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, షింజియాంగ్‌లో హైటెక్ నిఘా పరికరాలను చైనా ప్రభుత్వం అమర్చిన నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కాగా.. ఈ విషయంపై చైనా స్పందించింది. తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని ఖండించింది. అగ్రరాజ్యం అమెరికా జోక్యాన్ని ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది. తమ కంపెనీ హక్కులు, అవసరాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.