Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో మునిగిన థాయ్‌లాండ్ యుద్ధనౌక

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (08:24 IST)
థాయ్‌లాండ్‌కు చెందిన భారీ యుద్ధనౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై 31 మంది గల్లంతయ్యారు. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లో సముద్రతీరానికి 20 నాటికన్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధ నౌక సోమవారం సాయంత్రం మునిగిపోయింది. 
 
ఈ యుద్ధ నౌక గస్తీలో నిమగ్నమైవుండగా, బలమైన ఈదురుగాలులు వీయడంతో ఓ చిగురుటాకులా వణికిపోయింది. అదేసమయంలో ఓడలోకి నీరు వచ్చి చేరింది. ఈ నీటికి బయటకు పంపే ప్రయత్నం సిబ్బంది చేసినప్పటికి ఆ చర్యలు ఫలించలేదు. పైగా, నౌకలోకి నీటి పోటు అధికం కావడంతో అది మునిగిపోయింది.
 
ఈ నౌక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాయల్ నేవీ బోట్లు, హెలికాఫ్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని నౌకలో 106 మంది సిబ్బందిలో 75 మందిని రక్షించారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో నౌక అర్థరాత్రి సమయంలో పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గల్లంతైన వారిని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు సాగుతున్నట్టు రాయల్ నేవీ అధికార ప్రతినిధి అడ్మిరల్ ఫోకరోంగ్ మోంథపలిన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments