సెల్ఫీ మోజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారిపోయింది. కొన్నిసార్లు సెల్పీల పిచ్చి పరాకాష్టకు చేరుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో విని వుంటాం. తాజాగా ఓ కొత్త జంటకు సెల్ఫీ పిచ్చి ప్రమాదానికి గురిచేసింది. తాజాగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ జంట సెల్ఫీ మోజుతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
పెళ్లికి ముందు రోజే ఇద్దరూ ఆస్పత్రి పాలవడంతో పెళ్లి రద్దు అయ్యింది. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లా పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు అనే యువకుడికి కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్.కుమార్‌కు వివాహం నిశ్చయమైంది.
డిసెంబర్ 9న వివాహం ఫిక్స్ చేశారు. అదే సమయంలో కట్టుపురమ్ ఐయిరావిల్లీ క్వారీ వద్ద సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ స్టిల్ కోసం సిద్దమవుతుండగా.. ఇంతలోనే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వధువు శాండ్ర కాలుజారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ లోయలోకి పడిపోయింది.
ఆమెను కాపాడారు. ఆమెను కాపాడే క్రమంలో వరుడు కూడా లోయలోకి దూకేశాడు. దీంతో గాయాలకు పాలయ్యాడు. శాండ్ర వెన్నుముక, కాళ్లకు గాయాలు కావడంతో ఆమెకు మూడు నెలల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.