Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

సెల్వి
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (09:40 IST)
అమెరికాలో జరిగిన విషాద సంఘటనలో తెలుగు విద్యార్థిని తీవ్రంగా గాయాలపాలైంది. టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని దీప్తి వంగవోలు తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఈ ప్రమాదంలో దీప్తి వంగవోలు స్నేహితురాలు అయిన మరో యువతి కూడా గాయపడినట్లు సమాచారం.
 
ఈ సంఘటన ఏప్రిల్ 12 (శనివారం) తెల్లవారుజామున సుమారు 2:12 గంటలకు జరిగింది. దీప్తి వంగవోలు... ఆమె స్నేహితుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా డెంటన్‌లోని కారోల్ అల్ లాగో డ్రైవ్‌లోని 2300 బ్లాక్ సమీపంలో ఈ ఢీకొనడం జరిగింది. వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. వాహనం డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడని డెంటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసులు తెలిపారు. 
 
గాయపడిన మరో మహిళకు కూడా వైద్య సహాయం అందిస్తున్నట్లు స్థానిక అమెరికా మీడియా నివేదించింది. దీప్తి వంగవోలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 
 
ఆమె మార్చి 2023లో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నుండి తన బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేసింది. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా. ఈ హిట్-అండ్-రన్ కేసుపై డెంటన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments