Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా చిలుక పలుకులు.. కూటములు వద్దు.. కలిసి పనిచేద్దాం...

భారత్‌, జపాన్‌ మధ్య పెరుగుతున్న సంబంధాలను చైనా ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో పలు అంశాలను ప్రస్తావించడమే కాకుండా, హితోక్తులు చెప్పినట్టుగా చిలుక పలుకులు పలుకుతోంది.

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (07:33 IST)
భారత్‌, జపాన్‌ మధ్య పెరుగుతున్న సంబంధాలను చైనా ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో పలు అంశాలను ప్రస్తావించడమే కాకుండా, హితోక్తులు చెప్పినట్టుగా చిలుక పలుకులు పలుకుతోంది.
 
ముఖ్యంగా భారత్, జపాన్‌లు మరింత దగ్గర కావడం, ఇరు దేశాల మధ్య 15 రకాల కీలక ఒప్పందాలు కుదరడం, జపాన్ తొలిసారి తన రక్షణ సామాగ్రిని మరో దేశా(భారత్)నికి విక్రయించాలని నిర్ణయించడం వంటివి జీర్ణించుకోలేక పోతోంది.
 
ఈ నేపథ్యంలో ముంబై - అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు శంకుస్థాపనకు వచ్చిన జపాన్‌ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 15 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హు చున్‌యింగ్‌ స్పందించారు. ఇరు దేశాల ఒప్పందాలు శాంతి, స్థిరత్వానికి సహాయకారిగా ఉంటాయని నమ్ముతున్నట్టు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఈ ప్రాంతంలోని దేశాలు కూటములు కట్టడం కన్నా భాగస్వామ్యం కోసం పనిచేస్తే బాగుంటుందని వక్కాణించింది. 
 
ముఖ్యంగా, జపాన్‌ భారత్‌కు విక్రయించాలని భావిస్తున్న నేల, నింగి, నీటిలో పనిచేసే యూఎస్‌-2 యుద్ధ విమానం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. అబే, మోడీ సమావేశం పూర్తి వివరాలు తెలిస్తేనే స్పందిస్తామన్నారు. జపాన్‌ రక్షణ సామగ్రిని ఓ దేశానికి విక్రయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం కొందరిని విస్మయపరిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments