Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివో, ఒప్పో ఫోన్ల అమ్మకాలు డౌన్-తట్టా బుట్టా సర్దుకుని చైనాకు ఉద్యోగులు?

చైనా ఉత్పత్తులకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఉత్పత్తులను కొనడంపై భారతీయులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. భారత్-చైనాల మధ్య డోక్లామ్ సమస్యే ఇందుకు ప్రధాన కారణమైందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున

వివో, ఒప్పో ఫోన్ల అమ్మకాలు డౌన్-తట్టా బుట్టా సర్దుకుని చైనాకు ఉద్యోగులు?
, మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:42 IST)
చైనా ఉత్పత్తులకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఉత్పత్తులను కొనడంపై భారతీయులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. భారత్-చైనాల మధ్య డోక్లామ్ సమస్యే ఇందుకు ప్రధాన కారణమైందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డోక్లామ్ సమస్యకు తెరపడేలా భారత విదేశాంగ శాఖ డోక్లామ్ నుంచి భారత బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో.. డోక్లామ్ విషయంలో చైనా చేసిన అనవసర రాద్ధాంతంతో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత మొదలైంది. గతంలో చైనా ఉత్పత్తులంటే ఎగిరి గంతేసే భారతీయులు ప్రస్తుతం వాటిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
 
అంతేగాకుండా.. చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారం చైనా మొబైళ్ల  విక్రయాలపై ప్రభావం చూపింది. తద్వారా చైనా మొబైల్ ఉత్పత్తుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో వివో, ఒప్పో కంపెనీల ఫోన్లను కొనేవారే కరువయ్యారు.

గత రెండు నెలలుగా వీటి అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే 350కి మించిన ఉద్యోగులు తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి వెళ్ళిపోయారు. కానీ సదరు కంపెనీలు మాత్రం అమ్మకాలు బాగానే జరుగుతున్నట్లు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... 120 మి.మీ వర్షం... రైల్వే లైన్లపై పడవలు