Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాడు చేసిన తప్పుకు ఇపుడు మథనపడుతున్న కాంగ్రెస్... అందుకే ఆమె అడుగుపెట్టలేదు

ఎవరో కొంతమంది మాటలు విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది. 2014లో జరిగిన ఈ రాష్ట్ర విభజన పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ భూస్థాపితమైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస

Advertiesment
Presidential Election
, శుక్రవారం, 7 జులై 2017 (13:59 IST)
ఎవరో కొంతమంది మాటలు విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది. 2014లో జరిగిన ఈ రాష్ట్ర విభజన పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ భూస్థాపితమైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డిపాజిట్లు కోల్పోయింది. పోటీ చేసిన ఒక్కరికీ కూడా డిపాజిట్లు దక్కలేదు. ఇది జరిగిన మూడేళ్లు అవుతున్నా.. ఏపీ ప్రజలే కాదు... కాంగ్రెస్ నాయకులు కూడా మరచిపోలేక పోతున్నారు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.
 
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ఆయా రాష్ట్రాల్లో ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం ఎవరిదో తెలిసిపోయినప్పటికీ ఇటు ఎన్డీయే - అటు యూపీఏ అభ్యర్ధులు అన్ని రాష్ట్రాల్లో పర్యటించటం... ఎమ్మెల్యేలు, ఎంపీలను కలసి ఓట్లు అభ్యర్థించడం ఆనవాయితీగా మారింది.
 
ఇందులోభాగంగా, ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ , బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆయన కలుసుకున్నారు. వారి మద్దతు అభ్యర్థించారు. హైదరాబాద్‌లో వైకాపా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పేరు పేరున అందరినీ పలుకరించారు. పరిచయం చేసుకున్నారు. తెలంగాణలో కూడా ఇదే విధంగా జరిగింది.
 
కానీ, యూపీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మాత్రం ఏపీ గడ్డపై కాలు పెట్టలేక పోయారు. తెలంగాణలో నామమాత్రంగా పర్యటించి, అక్కడ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్‌కు రాలేదు. దేశంలో యూపీఎ రాష్ట్రపతి అభ్యర్ధి వెళ్లని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశేనని రాజకీయ నేతలు చెబుతున్నారు. 
 
నాటి విభజన పాపం కారణంగా 2014 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పెరగలేదని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు మరింత నిరుత్సాహానికి లోనయ్యారు. ఇప్పటికే అనేక మంది పార్టీకి గుడ్‌బై చెప్పగా, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కోస్తాలో మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఇదే మార్గంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద నాడు చేసిన తప్పుకు కాంగ్రెస్ నేతలు ఇపుడు మథన పడుతూ దిక్కులు చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా నగ్న ఫోటోలు పంపుతున్నా.. వాటిని ఎవరికైనా విక్రయించి 'డ్రగ్స్' కొనివ్వరా... ప్లీజ్