Webdunia - Bharat's app for daily news and videos

Install App

తానే డిజైన్ చేసుకున్న కారులో శ్మశానికి ప్రిన్స్ ఫిలిప్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:05 IST)
బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూశారు. అయితే, ఆయన అంతిమయాత్రకు ఉపయోగించే కారును ఆయనే స్వయంగా డిజైన్ చేసుకోవడం గమనార్హం. 15 యేళ్ళ క్రితం డిజైన్ చేసుకున్న కారులోనే ఫిలిప్ మృతదేహాన్ని శ్మశానానికి తరలించనున్నారు. 
 
బ్రిటిన్ రాణి ఎలిజబెత్ భర్త అయిన ఫిలిప్ చనిపోగా ఆయన అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. అయితే, తన శవయాత్ర కోసం దాదాపు 15 సంవత్సరాల క్రితం ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ స్వయంగా డిజైన్ చేయించుకున్న లాండ్ రోవర్ కారులోనే, ఆయన శవపేటిక శనివారం విండ్ సర్ క్యాజిల్‌లోని శ్మశానానికి తరలనుంది. 
 
ఈ విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గతవారం కన్నుమూసిన ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు ఈ వారాంతంలో జరుగనున్నాయన్నాయి. 
 
కాగా, టాటా మోటార్స్ సంస్థ బ్రిటన్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ సంస్థను టేకోవర్ చేయడానికి మూడేళ్ల ముందు... అంటే, 2005లో ప్రిన్స్ ఫిలిప్ ఈ వాహనాన్ని తన అభిరుచుల మేరకు డిజైన్ చేయించుకున్నారు. 
 
ఏప్రిల్ 17న ఆయన శవపేటిక మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాహనంలోకి చేరుస్తారని, ఆపై 8 నిమిషాల తర్వాత అది సెయింట్ జార్జ్ చాపెల్ ప్రాంతానికి చేరుతుందని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఈ వాహనం వెంబడి రాజ కుటుంబీకులు, ఇతర ముఖ్యలు నడుస్తారని తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments