Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మూడోకన్ను తెరిస్తే కేసీఆర్‌కు చిప్పకూడే : సోము బాబూరావు

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెరాస పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడో కన్ను తెరిచారంటే సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెరాస టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. అవినీతి కార్యకలాపాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
 
పనిలోపనిగా ఎమ్మెల్యే జోగు రామన్నపైనా నిప్పులు చెరిగారు. జోగు రామన్న పెద్ద అవినీతిపరుడు అని, కోట్ల రూపాయల మేర అక్రమాలు చేశాడని అన్నారు. నన్ను ఏదో చేయాలని చూస్తే అడ్రస్ లేకుండా చేస్తా అని సోయం బాపూరావు హెచ్చరించారు. 
 
తాను నక్సల్స్ కే భయపడలేదని, జోగు రామన్న ఓ లెక్కా? అంటూ వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడితే నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు... సోయం బాపూరావు దండు కదిలితే తట్టుకోలేరు అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments