Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ కాంట్ ఫీడ్ యూ బేబీ... చంటి బిడ్డను చూసి జోకేసిన ఒబామా (వీడియో)

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:56 IST)
బరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. అమెరికా నల్లసూరీడు. అధ్యక్షుడుగా చెరగని ముద్రవేసుకున్న ఒబామా... ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు అయినా ప్రజల మనసులో మాత్రం చెరగని ముద్రవేసుకున్నాడు. 
 
తాజాగా ఆయన హవాయి రాష్ట్రంలోని కనైలి ప్రాంతంలో ఉన్న ఓ గోల్ఫ్ కోర్సుకు వెళ్లిన వేళ, తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ తల్లి, తన బిడ్డను ఆడిస్తూ ఆయన కంటపడింది. అంతే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లిన ఒబామా... ఆ పాపను ఎత్తుకున్నాడు. ఎవరీ పాప? అంటూ అడిగారు. పాపాయి వయసెంతని అడుగగా, ఆ తల్లి మూడు నెలలని బదులిచ్చింది. 
 
ఒబామా హాయ్ చెప్పగా, పాప తల్లి... 'హాయ్ చెప్పు' అంటుండగా, ఆ చిన్నారి చెయ్యి పైకి లేచింది. వెంటనే ఒబామా, "ఆమె చేతులు ఊపుతోంది" అంటూ, "నేను నీకు పాలివ్వలేను" (ఐ కాంట్ ఫీడ్ యూ బేబీ) అని జోకేశారు. 
 
ఆపై పాప నుదిటిపై ప్రేమగా చుంభించాడు. మాజీ అధ్యక్షుడి చర్యతో పాపాయి తల్లి టిఫానీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ వీడియోను తీశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments