Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియుడుతో వెళ్లిపోయిన వివాహిత

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:48 IST)
చిత్తూరు జిల్లాలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహితుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ ప్రాంతానికి చాలా దూరంగా వెళ్లిపోయి సహజీవనం చేస్తున్న వారిని ఫోన్ కాల్ పట్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన రవి (35) అనే వ్యక్తి ఆ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఓ భవంతిలో నిర్మాణ పనులు చేస్తున్న వేళ, కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన మంజుల (25) అనే వివాహిత బేల్దారీ పనికి అక్కడికే వెళ్లింది. అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఆమె, రవి, ఒకరిని ఒకరు ఇష్టపడి, దగ్గరయ్యారు. హైదరాబాద్‌ను విడిచి దూరంగా వెళ్లిపోయి, బతకాలని నిర్ణయించుకున్నారు.
 
ఈ క్రమంలో తన పిల్లలను తీసుకుని రవితో కలిసి మంజుల, చిత్తూరు జిల్లాలోని అంగళ్లు అనే గ్రామానికి వచ్చి, అద్దె ఇల్లు తీసుకుని, కలసి కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించారు. మంజుల, తన పిల్లలతో సహా అదృశ్యం కావడంపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. 
 
వారి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, అంగళ్లు గ్రామంలో ఉన్నారని గుర్తించి, అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసుల సాయంతో సహజీవనం చేస్తున్న జంటను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్ కు తరలించారు. కేసును విచారిస్తున్నామని, వారికి కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments