Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తృటిలో పెను ప్రమాదం తప్పింది.. మహిళను అలా కాపాడిన రైల్వే పోలీస్

Advertiesment
తృటిలో పెను ప్రమాదం తప్పింది.. మహిళను అలా కాపాడిన రైల్వే పోలీస్
, శనివారం, 21 డిశెంబరు 2019 (18:54 IST)
పెను ప్రమాదం నుంచి ఆ మహిళ తృటిలో తప్పించుకుంది. ఆ క్షణంలో ప్రాణంపోయి ఉంటే ఏమయ్యేదోనన్న భయం ఆమెను కుదిపేసింది. రైలు ప్రయాణంలో బోగీనుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ జారిపోయిందో మహిళ. అయితే అదే ప్లాట్ ఫామ్‌పై కాపలా కాస్తున్న ఓ పోలీస్ ఆమె పాలిట దేవుడిలా మారాడు బోగీనుంచి జారిపోతున్న ఆమెను ప్లాట్ ఫామ్ మీదకు అత్యంత లాఘవంగా లాగేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ నుంచి ధన్ పూర్ వరకూ వెళ్లే ఎక్స్ ప్రెస్ ట్రైన్ దాని నెంబర్ 12791 ఈ ట్రైన్ లోని ఎస్ 12 బోగీ నుంచి ఓ ప్రయాణీకురాలు దిగబోతోంది. అంతలోనే ఏమైందో ఏమోకానీ ఆమె కాలు జారి రైలుకు, ప్లాట్ ఫామ్‌కు మధ్యకు జారిపోబోయింది. అంతలో అదే రైలును గమనిస్తున్న రైల్వే రక్షణ దళ సిబ్బంది అప్రమత్తమయ్యాడు. 
 
రైలుకు, ప్లాట్ ఫామ్‌కు మధ్యకు జారిపోతున్న ఆమెను అతి బలవంతం మీద బలమంతా ప్రయోగించి ప్లాట్ ఫామ్ పైకి లాగాడు. ప్రాణాపాయం నుంచి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన ఈనెల 18న జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు రాజధానులతో మంచే జరుగుతుంది.. జగన్‌కు చిరు కితాబు.. మరి పవన్?