మహిళలపై అకృత్యాలు అమాంతం పెరిగిపోతున్నాయి. వావివరుసలు లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు చెల్లెలిపైనే తన కామ వాంఛను తీర్చుకున్నాడు. ఈ అకృత్యం కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (13)పై.. ఆమె పెద్దమ్మ కొడుకు (20) పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భం దాల్చింది.
బాలిక గర్భం దాల్చిన ఆర్నెళ్ల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే గర్భస్రావం చేయించే అవకాశం కూడా లేకపోవడంతో.. బాలికను ఐసీడీఎస్ సంరక్షణలో ఉంచారు. బాలికకు తొమ్మిది నెలలు నిండటంతో బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.