Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంతి కోసం ముద్దులు పెట్టుకున్న పోప్ ఫ్రాన్సిస్ - ముస్లిం ఇమామ్

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (20:45 IST)
ప్రపంచ క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్, అల్ అజీర్ మసీదు ఇమామ్ షేక్ అహ్మద్‌లు ముద్దులు పెట్టుకున్నారు. వీరిద్దరూ చుంభనం చేయడానికి కారణం లేకపోలేదు. ఈ ముద్దుల వెనుక ఉన్న కథ ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
మూడు రోజుల చారిత్రాత్మక పర్యటన కోసం పోప్ ఫ్రాన్సిస్ యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అబుదాబీలో ఉన్న అల్ అజర్ మసీదుకు చెందిన ఇమామ్‌ షేక్ అహ్మద్ అల్ దాయెబ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రపంచ శాంతి కోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
 
ఈ సందర్భంగా వారిద్దరూ ముద్దులు పెట్టుపెట్టుకోవడమే కాకుండా, ఆలింగనం చేసుకున్నారు. అంతర్ మత సమావేశంలో ఈ ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ శాంతి కోసం పరస్పరం చేతులు కలపాలని ముస్లిం సమాజానికి ఇటీవలే పిలుపునిచ్చిన పోప్ యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. 
 
మానవాళికి సంబంధించి ప్రపంచ శాంతి కోసం, పరస్పర సహజీవనం కోసం చేసుకున్న ఈ ఒప్పంద పత్రం క్రిస్టియన్లు, ముస్లింల మధ్య చర్చలకు ముఖ్యమైన ముందడుగుగా వాటికన్ అభివర్ణించింది. మత విశ్వాసాలలో స్వేచ్ఛ, సహన సంస్కృతి పెంపుదల, ప్రార్థనా స్థలాల పరిరక్షణ, మైనార్టీలకు పూర్తిస్థాయి పౌరసత్వం వంటివి ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments