Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌తో పాటు నాటు నాటు పాట గురించి ప్రస్తావించిన ప్రధాని

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (09:18 IST)
Modi
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో వున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. 
 
ముఖేష్ అంబానీ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్ కూడా పాల్గొన్నారు. ఈ విందు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అమెరికాలో బేస్‌బాల్‌కు ఆదరణ లభిస్తుండగా, క్రికెట్‌ కూడా ప్రాచుర్యం పొందుతోంది.
 
భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనే ప్రయత్నంలో అమెరికా క్రికెట్ జట్టు క్వాలిఫయర్స్‌లో ఆడుతోంది. అలాంటి క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నానని ప్రధాని ఆకాంక్షించారు. 
 
భారతీయ-అమెరికన్లు ఒకరినొకరు బాగా తెలుసుకుంటున్నారు. భారతీయ పిల్లలు స్పైడర్ మ్యాన్ వేషధారణతో హాలోవీన్ జరుపుకుంటారు. 
 
దేశీయ పాట నాటు నాటు పాటకు యువత డ్యాన్స్ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 
 
ఈ పార్టీని నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments