Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రదేశాధినేత బైడెన్‌తో భారత ప్రధాని మోడీ... నేడు బెడెన్ దంపతుల విందు

Advertiesment
biden - modi
, గురువారం, 22 జూన్ 2023 (08:51 IST)
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. అలాగే, అమెరికా కాంగ్రెస్ సభను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. మరోవైపు, రేపు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి బైడెన్‌ దంపతులు గురువారం విందు ఇస్తారు. శుక్రవారం కమలా హ్యారిస్‌ దంపతులు ఏర్పాటు చేసే విందుకు కూడా మోడీ హాజరుకానున్నారు. 
 
శ్వేత సౌథానికి వెళ్లేందుకు మోడీ వాషింగ్టన్‌ డీసీకి చేరుకొనే సమయానికి వర్షం పడుతోంది. అయినా, ఇండో-అమెరికన్లు ఆయన కోసం వేచి ఉండి స్వాగతం పలికారు. దీనిపై మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. 'వాషింగ్టన్‌ డీసీ చేరుకొన్నాను. భారతీయుల ఆత్మీయ స్వాగతం.. ఇంద్రదేవత ఆశీర్వాదం (వర్షాన్ని ఉద్దేశించి) దీనిని మరింత స్పెషల్‌గా చేశాయి' అని పేర్కొన్నారు.  
 
అనంతరం ప్రధాని మోడీ శ్వేతసౌధానికి చేరుకున్న తర్వాత అక్కడ జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ స్వాగతం పలికారు. జో బైడెన్‌, ఆయన కుటుంబీకులను మోడీ ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ఆత్మీయ బంధాన్ని, స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకున్నారన్నారు. 
 
ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షడు బైడెన్‌ ప్రత్యేక కానుకలు ఇవ్వనున్నారు. 20వ శతాబ్ధం ప్రారంభంలో పూర్తిగా చేతితో తయారు చేసిన పుస్తకం ‘గ్యాలీ’ని, ఒక పురాత కెమెరాను, తొలి కొడాక్‌ కెమెరా కోసం జార్జ్‌ ఈస్ట్‌మన్‌కు జారీ చేసిన పేటెంట్‌ ఆర్కైవల్‌ కాపీ, అమెరికా వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ హార్డ్‌బుక్‌ను బైడెన్‌ బహూకరించనుండగా.. ప్రముఖ కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ సేకరించిన కవితల సైన్డ్‌ కాపీని జిల్‌ అందించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండుగా విడిపోయిన లోహిత్ ఎక్స్‌ప్రెస్