Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం నింగిలో ప్రయాణిస్తుండగా ప్రసవించిన మహిళ

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (17:53 IST)
విమానంలో నింగిలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది అరబ్ ఎమిరేట్స్ విమానంలో జరిగింది. ఈ నెల 19వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ మహిళ జపాన్ రాజధాని టోక్యోకు సమీపంలోని నరిటా నుంచి దుబాయ్‌కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరింది. 12 గంటల విమాన ప్రయాణంలో ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఎమిరేట్స్ సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసరమైన వైద్య సాయం అందించారు. దీంతో విమానంలో నింగిలో ప్రయాణిస్తుండగానే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆ విమాన సంస్థ తాజాగా వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపింది. 
 
కాగా, విమానం గాల్లో ఉన్న సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పటికీ విమానం మాత్రం నిర్ణీత సమయానికే దుబాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుందని తెలిపారు. ఆ తర్వాత తల్లిబిడ్డను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. తమ సిబ్బందితో పాటు ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ముఖ్యమని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments