భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ అయ్యింది. తాను టెన్నిస్ మైదానానికి గుడ్ బై చెప్పడానికి కొద్దిరోజులు మాత్రమే వున్నాయని పేర్కొంది. 36 ఏళ్ల సానియా మీర్జా గత ఏడాది చివరిలో మోచేయి గాయం కారణంగా రాకెట్‌ని పక్కనబెట్టింది. అదే కారణంతో యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉంది. ఆగస్టు 2022లో ఆడిన మ్యాచ్‌తోనే టెన్నిస్ మైదానంలో అడుగుపెట్టలేదు.
మహిళల డబుల్స్‌లో మాజీ నెం.1 అయిన 36 ఏళ్ల అయిన సానియా మీర్జా.. డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను, అలాగే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్‌లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది.
ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ తన వృత్తి జీవితంలో చివరి టోర్నమెంట్ అని 36 ఏళ్ల ప్రపంచ టెన్నిస్ అసోసియేషన్ వెబ్‌సైట్‌తో తెలిపింది.