Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా తిన్నాడు.. గుండె ఆగిపోయింది.. ఎందుకలా జరిగింది..?

Webdunia
సోమవారం, 9 మే 2022 (12:40 IST)
ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసి.. రెండంటే రెండే ముక్కలు తిన్న23 ఏళ్ల వ్యక్తి గుండె ఆగిపోయి చనిపోయాడు. ఈ ఘటన జరిగి రెండేళ్లైనా ఈ ఘటనపై విచారణ ప్రారంభం కానుంది. 
 
వివరాల్లోకి వెళితే... జేమ్స్​ అట్కిన్​సన్ అనే యువకుడు​ ఇంగ్లండ్‌లోని​ న్యూక్యాసిల్​లో నివసించేవాడు. న్యూక్యాసిల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్​లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్​లో నివాసం ఉండేవాడు. 2020 జులై 10న డడ్యాల్ అనే రెస్టారెంట్​ నుంచి డెలివరూ యాప్​ ద్వారా చికెన్ టిక్కా మసాలా పిజ్జాను ఆర్డర్ చేశాడు. 
 
కాసేపటికే ఆర్డర్ డెలివరీ తీసుకున్నాడు. తినటం ప్రారంభించి.. రెండు ముక్కలు పూర్తి కాగానే అతడి పెదవులు, గొంతు వాచిపోయాయి. నొప్పితో బాధపడుతూ వెంటనే సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే వైద్య సిబ్బంది జేమ్స్ ఇంటికి చేరుకున్నారు.  
 
జేమ్స్ ను పరిశీలించిన వైద్యులు అతడు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడని.. మరణించినట్లు ధృవీకరించారు. దీనికి కారణం ఏమిటా అని పరిశీలిస్తే.. చిన్నప్పటి నుంచి అతడికి పీనట్ అలర్జీ ఉన్నట్లు తేలింది. జేమ్స్ ఆర్డర్ చేసిన పిజ్లాలో సదరు రెస్టారెంట్ వేరుశెనగ పొడిని వినియోగించినట్లు తేలింది. 
 
పిజ్జా తయారీలో అసలు ఏఏ ముడిపదార్ధాలను వినియోగిస్తారో తెలపకపోవటం వల్లనే తన కుమారుడు మృతికి కారణని అతని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డడ్యాల్ రెస్టారెంట్ ఇప్పటికే మూతపడింది. ఈ ఘటనపై మంగళవారం విచారణ ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments